India corona: భారీగా పెరిగిన కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తోన్న పాజిటివిటీ రేటు..!

దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. దాంతో తాజాగా కొత్త కేసులు 17 వేలకు పైగా నమోదయ్యాయి.

Published : 24 Jun 2022 09:56 IST

0.20 శాతానికి క్రియాశీల రేటు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరిగి.. 17 వేలకు పైగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు నాలుగు శాతం దాటి, ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఫిబ్రవరి నెల నాటి ఉద్ధృతి కనిపిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

నిన్న 4 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 17,336 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర పెరిగి, 30 శాతం అధికంగా నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్ర, కేరళలోనే 9 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. దిల్లీలో ముందురోజు కంటే రెట్టింపు కేసులు రాగా, ముంబయిలో 50 శాతం అధికంగా నమోదయ్యాయి. 2020 ప్రారంభం నుంచి 4.33 కోట్ల మంది మహమ్మారి బారినపడ్డారు. అందులో 4.27 కోట్ల మందికి పైగా కోలుకున్నారు.

అయితే ప్రస్తుతం వైరస్ క్రమంగా వ్యాపిస్తుండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 88,284కి చేరింది. క్రియాశీల రేటు 0.20 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు(98.59 శాతం) రోజురోజుకూ పడిపోతోంది. 24 గంటల వ్యవధిలో 13,029 మంది కోలుకున్నారు. 13 మంది మరణించారు. ఇక నిన్న 13.7 లక్షల మంది టీకా తీసుకోగా.. 196 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని