Corona: కొత్త కేసులు 2వేల పైనే.. మళ్లీ ‘మాస్క్‌లు’ తప్పనిసరి చేస్తోన్న రాష్ట్రాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చు తగ్గుదలతో కొత్త కేసులు 2వేల పైనే ఉంటున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా

Published : 26 Apr 2022 10:00 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా స్వల్ప హెచ్చు తగ్గుదలతో కొత్త కేసులు 2వేల పైనే ఉంటున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,49,197 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,483 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉంది. ఇదే సమయంలో 1970 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది.

క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసులు మళ్లీ 16వేల కిందకు దిగొచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,636 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. ఇక నేడు 1399 మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను సవరించడంతో మరణాలు పెరిగినట్లు సమాచారం.

ఇక గత కొద్ది రోజులుగా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నట్లు కన్పించడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని దిల్లీ సహా కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలు మళ్లీ మాస్క్‌ నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. నిన్న మరో 22.83లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని