Corona: 0.07 శాతానికి క్రియాశీల కేసులు.. 24 గంటల్లో కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోంది. గత నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య 3వేలకు దిగువనే ఉంటుండగా.. మరణాలు కూడా 100లోపే నమోదవుతుండటం

Updated : 17 Mar 2022 12:12 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత నాలుగు రోజులుగా కొత్త కేసుల సంఖ్య 3వేలకు దిగువనే ఉంటుండగా.. మరణాలు కూడా 100లోపే నమోదవుతుండటం ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 7.17లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 2,539 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. పాజిటివిటీ రేటు 0.35శాతంగా ఉంది. 

ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 60 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 5,16,132 మందిని మహమ్మారి బలితీసుకుంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 4,491 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.73శాతంగా ఉంది. కొత్త కేసులు క్రమంగా తగ్గుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య దిగస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30,799 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.07శాతానికి పడిపోయింది. 

12-14ఏళ్ల వారికి టీకా.. తొలి రోజు 2.60లక్షల మందికి

దేశంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు వేస్తోన్న విషయం తెలిసిందే. తొలి రోజు ఈ వయసు వారిలో 2,60,136 మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖవెల్లడించింది. ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 180.80కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు 2.15 కోట్ల మంది ప్రికాషన్‌ డోసులు తీసుకున్నట్లు పేర్కొంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని