India Corona: 3 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..!

గత కొద్ది కాలంగా దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంటోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు ఐదు వేలకు దిగువనే నమోదువుతున్నాయి.

Updated : 27 Sep 2022 11:01 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. తాజాగా 2.74 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా.. కేసులు 3 వేలకు తగ్గాయి. కొత్త కేసులు జూన్‌ నెల స్థాయికి తగ్గడం మరింత ఊరటనిస్తోంది. మరోవైపు క్రియాశీల కేసులు క్రమంగా దిగొస్తున్నాయని మంగళవారం కేంద్రం వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

కొత్త కేసులు: 3,230

పాజిటివిటీ రేటు: 1.18 శాతం

రికవరీలు: 4,255

రికవరీ రేటు: 98.72 శాతం

క్రియాశీల కేసులు: 42,358(0.10శాతం)

మొత్తం కేసులు: 4.45 కోట్లు

మొత్తం మరణాలు: 5,28,562

టీకా డోసులు: 217.8 కోట్లు(నిన్న 14.08 లక్షల మంది టీకా తీసుకున్నారు)

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని