Corona: మరోసారి 40వేలు దాటిన కొత్తకేసులు..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. తాజాగా 24 గంటల వ్యవధిలో

Updated : 01 Sep 2021 15:03 IST

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే మంగళవారం తగ్గుముఖం పట్టిన కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 41,965 కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే, ఇందులో రెండొంతులకు పైన కేసులు ఒక్క కేరళలోనే నమోదవుతుండటం ఆందోళనకరంగా మారింది. ఆ రాష్ట్రంలో 30,203 కేసులు బయటపడ్డాయి. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.28కోట్లు దాటింది. ఇక 24 గంటల వ్యవధిలో 33,964 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3.19కోట్ల మందికి పైనే కరోనాను జయించగా.. రికవరీ రేటు 97.51శాతానికి చేరింది. మరోవైపు నిన్న మరో 460 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 115 మరణాలు ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో 4,39,020 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది.
కొత్త కేసులు పెరగడంతో క్రియాశీల కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,78,181 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.15శాతంగా ఉంది. 

టీకా ‘రికార్డ్‌’.. ఒక్కరోజే 1.33కోట్ల డోసుల పంపిణీ

ఇదిలా ఉండగా.. టీకా పంపిణీలో భారత్ మరోసారి రికార్డు సృష్టించింది. ఆగస్టు 27న తొలిసారి 24గంటల్లో కోటి డోసులకు పైగా పంపిణీ చేయగా.. నిన్న ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం దేశవ్యాప్తంగా 1.33కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు 65.41 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు 50కోట్ల మందికి తొలి డోసు పూర్తిచేయడం విశేషం. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు