Corona: మళ్లీ 40వేలు దాటిన కొత్త కేసులు.. ముంబయిలో పెరుగుతున్న ఉద్ధృతి
దిల్లీ: కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. కొద్ది రోజులుగా 40వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. మళ్లీ ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18.17లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 43,263 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు(37,875)తో పోలిస్తే దాదాపు 6వేల కేసులు పెరగడం గమనార్హం. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31కోట్లు దాటింది. ఇదే సమయంలో 338 మందిని వైరస్ బలితీసుకుంది. దేశంలో ఇప్పటివరకు 4,41,749 మంది కరోనాతో మరణించారు.
ఒక్క కేరళలోనే 30వేలు..
కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొన్నటిదాకా 20వేల దిగువన ఉన్న కేసులు తాజా మళ్లీ 30వేలు దాటడం గమనార్హం. ఆ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 30,196 కేసులు బయటపడ్డాయి. 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అటు దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500లకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ముంబయిలో ఈ స్థాయిలో కేసులు రావడం జులై 15 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
రికవరీలే తక్కువ..
ఇక కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండగా.. నేడు రికవరీలు తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 40,567 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు దేశంలో 3.23కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.48శాతంగా ఉంది. అటు కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులు మళ్లీ 4లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,93,614 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.19శాతంగా ఉంది.
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 86.51లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 71.65కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: కాబుల్‌లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
India News
Tiranga Yatra: తిరంగా యాత్ర పైకి దూసుకెళ్లిన ఆవు.. గాయపడ్డ మాజీ ఉపముఖ్యమంత్రి
-
Sports News
Ross Taylor : ఆ మ్యాచ్‌లో డకౌట్.. రాజస్థాన్ ఫ్రాంచైజీ ఓనర్ నా మొహంపై కొట్టాడు: టేలర్
-
Movies News
Liger: షారుఖ్ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్’ జోడీ..!
-
General News
Monkey pox: మంకీపాక్స్ ప్రమాదకరం కాదు కానీ... ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్‌కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్‌ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి