Corona: అదుపులోనే కరోనా వ్యాప్తి.. కొత్త కేసులు ఎన్నంటే..?

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్తకేసులు పది వేలలోపే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల

Published : 01 Sep 2022 09:47 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్తకేసులు పది వేలలోపే నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దాదాపు 8వేల కేసులు నమోదవ్వగా.. క్రియాశీల కేసులు మరింత తగ్గడం ఊరటనిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

* గడిచిన 24 గంటల్లో 2.66లక్షల పరీక్షలు నిర్వహించగా.. 7,946 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.98శాతంగా ఉంది. క్రితం రోజు(7,231 కేసులు)తో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి.

* ఇదే సమయంలో 9,828 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4.38కోట్ల మంది కరోనాను జయించగా.. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది.

* కొత్తకేసులు తగ్గుతుండటంతో క్రియాశీల కేసులు దిగొస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 62,748 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్‌ కేసుల రేటు 0.14శాతానికి తగ్గింది.

* ఇక బుధవారం మరో 12.90లక్షల మంది టీకాలు వేయించుకొన్నారు. ఇప్పటి వరకు 212.52కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు