India Corona: మళ్లీ 8 వేలకుపైగా కొత్త కేసులు.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా..!

దేశంలో కరోనా వైరస్(coronavirus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి 8 వేలకు పైగా కేసులు రాగా.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి.

Published : 15 Jun 2022 09:57 IST

53 వేలకు పైగా క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(coronavirus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరోసారి 8 వేలకు పైగా కేసులు రాగా.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

* మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 8,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. క్రితంరోజు ఆ సంఖ్య 6,594గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,986, దిల్లీలో 1,118 మందికి కరోనా సోకింది. హరియాణా, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. 

దీంతో క్రియాశీల కేసులు 53,637కి ఎగబాకాయి. మొత్తం కేసుల్లో వాటి వాటా 0.12 శాతానికి పెరిగింది. 

24 గంటల వ్యవధిలో 5,718 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 98.66 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. నిన్న 15 మంది మరణించగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో నిన్న 13.58 లక్షల మంది టీకా తీసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని