Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్‌ కేసు.. మూడుకు చేరిన బాధితుల సంఖ్య!

కేరళలో మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు కలకలం రేపుతున్నాయి.  తాజాగా మూడో కేసు మూడో కేసు నమోదైంది......

Updated : 22 Jul 2022 17:40 IST

తిరువనంతపురం: కేరళలో మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు కలకలం రేపుతున్నాయి.  తాజాగా మూడో కేసు నమోదైంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మూడు కేసులూ కేరళలోనే వెలుగుచూడటం గమనార్హం. జులై 6న యూఏఈ నుంచి మలప్పురం వచ్చిన 35ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్‌ వైరస్‌ను తాజాగా గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. అతడికి జ్వరం  ఉండటంతో మంజెర్రీ వైద్య కళాశాలలో చేర్పించగా 15వ తేదీ తర్వాత అతడిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని.. బాధితుడి కుటుంబం, క్లోజ్‌ కాంటాక్ట్‌లను పరిశీలనలో ఉంచినట్లు పేర్కొన్నారు. తాజా కేసుతో రాష్ట్రంలో మూడో మంకీపాక్స్‌ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ కార్యాలయం తెలిపింది.

దేశంలో మంకీపాక్స్‌ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల విమానాశ్రయాలు, ఓడరేవులకు  కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు మరింత కఠినంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా అంతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని