India-America: అమెరికాకు దీటుగా బదులిచ్చిన భారత్‌

మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భారత్‌ సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కేంద్రం తెలిపింది...

Updated : 26 Jul 2021 16:08 IST

దిల్లీ: మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భారత్‌ సాధించిన విజయాలు దేశానికే గర్వకారణమని కేంద్రం తెలిపింది.  భారత్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. జులై 27న భారత్‌కు రానున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ అంశాలను లేవనెత్తనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

మానవ హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పరిధులు ఉండవని భారత్‌ వ్యాఖ్యానించింది. వైవిధ్యత, భిన్నత్వాన్ని గుర్తించి గౌరవించే ప్రతి దేశంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం, బహుళత్వం, వైవిధ్యత విషయంలో ప్రపంచ స్థితిగతులను తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. అందుకు భారత్‌ పూర్తిగా సహకరిస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని