Corona virus:కొవిడ్‌ కష్టకాలంలో అఫ్గాన్‌కు భారత్‌ సాయం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇంకా పట్టిపీడిస్తున్న వేళ అఫ్గానిస్థాన్‌కు భారత్‌ మానవతా...

Updated : 01 Jan 2022 15:54 IST

దిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇంకా పట్టిపీడిస్తున్న వేళ అఫ్గానిస్థాన్‌కు భారత్‌ మానవతా దృక్పథంతో తన వంతు సహకారం అందించింది. ఆ దేశానికి 5లక్షల డోసుల కొవాగ్జిన్‌ టీకాలను శనివారం పంపింది. కాబూల్‌లోని ఇందిరాగాంధీ పిల్లల ఆస్పత్రికి ఈ టీకాలను అప్పగించింది. తాలిబన్లు ఆక్రమణకు పాల్పడంతో చెలరేగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్‌కు మరికొన్ని వారాల్లో మరో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్‌ని పంపిణీ చేయనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని