UNSC: భారత్‌కు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలి: బైడెన్‌

ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వతసభ్యత్వం ఉండాలని బైడెన్ ఉద్ఘాటించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు....

Updated : 25 Sep 2021 13:42 IST

వాషింగ్టన్‌: ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్‌కు ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ)’లో శాశ్వతసభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ ప్రతిపాదనపై అమెరికా సైతం సానుకూలంగా స్పందించింది. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ భారత్‌కు శాశ్వతసభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. ఆగస్టు నెలలో యూఎన్‌ఎస్సీ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌.. అఫ్గానిస్థాన్‌ సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిందని బైడెన్‌ కొనియాడారు. ఈ నేపథ్యంలో భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నానన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో భేటీ అనంతరం బైడెన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దేశాల్లో భారత్‌ ఒకటి. ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా వ్యవహరించింది. యూఎన్‌ఎస్సీలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. వీటిలో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా.. మరో 15 దేశాలను తాత్కాలిక సభ్యదేశాలుగా రెండేళ్ల కాలపరిమితితో ఎన్నుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని