Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
దేశంలోకి మరిన్ని చీతాలు (Cheetahs) రాబోతున్నాయి. వచ్చే నెలలో 12 చీతాలను తీసుకొచ్చేందుకు దక్షిణాఫ్రికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
దిల్లీ: దాదాపు 74 ఏళ్ల తర్వాత భారత్‌లోకి చీతాలు (cheetahs) ప్రవేశించగా.. ఇప్పుడు వాటి సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా (South Africa) నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చేందుకు ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు భారత్‌కు రానున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.
చీతాల (cheetahs) కోసం భారత్, దక్షిణాఫ్రికా మధ్య గతవారం ఒప్పందం జరిగిందని ఆ అధికారి తెలిపారు. ఏడు మగ, ఐదు ఆడ చీతాలను ఫిబ్రవరి 15న మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఈ 12 చీతాలు గత ఆరు నెలలుగా దక్షిణాఫ్రికాలో పత్యేక క్వారంటైన్‌లో ఉన్నాయి. ఈ నెల్లోనే ఇవి భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది’’ అని తెలిపారు. అటు దక్షిణాఫ్రికా పర్యావరణ విభాగం కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే 10 ఏళ్లలో భారత్‌కు పదుల సంఖ్యలో చీతాలను అందించేందుకు అవగాహన ఒప్పందం జరిగిందని తెలిపింది. తొలి బ్యాచ్‌లో భాగంగా 12 చీతాలను ఫిబ్రవరిలో పంపించనున్నట్లు పేర్కొంది.
1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా (cheetahs) చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్ (Kuno National Park)కు తరలించారు. గతేడాది సెప్టెంబరు 17న తన పుట్టినరోజున ప్రధాని మోదీ స్వయంగా వీటిని పార్కులో విడిచిపెట్టారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్న చీతాలు.. తొలి వేటను కూడా చేసినట్లు ఆ మధ్య అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tagore Movie: పాటలు వద్దన్న మురగదాస్.. అలా ఛాన్స్ దక్కించుకున్న వినాయక్
-
Manipur : మయన్మార్ సరిహద్దులో కొత్తగా 70కి.మీ మేర కంచె నిర్మాణానికి ప్రణాళిక : మణిపుర్ సీఎం
-
RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..
-
Congress: సీట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: మధుయాష్కీ
-
Hyderabad: పట్టుబడిన వాహనాల వేలం.. పోలీసుశాఖకు రూ.కోట్ల ఆదాయం
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి