Jaishankar: చైనాతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం: జైశంకర్‌

సరిహద్దు దేశం చైనాతో సత్సంబంధాల కోసం భారత్‌ ప్రయత్నిస్తూనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. అయితే పరస్పర గౌరవం, ఇరుదేశాల ప్రయోజనాలపై మాత్రమే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. అమెరికా పర్యటనలో..

Published : 30 Sep 2022 00:48 IST

వాషింగ్టన్: సరిహద్దు దేశం చైనాతో సత్సంబంధాల కోసం భారత్‌ ప్రయత్నిస్తూనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. అయితే పరస్పర గౌరవం, ఇరుదేశాల ప్రయోజనాలపై మాత్రమే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌-చైనా మధ్య సంబంధాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘చైనాతో సత్సంబంధాల కోసం మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, ఇది ఇరుదేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది.’’ అని జైశంకర్‌ అన్నారు. చైనా సైన్యం ఇండోఫసిపిక్‌ రీజియన్‌పై పట్టు సాధించేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో ఈ రీజియన్‌ను బలోపేతం చేయడం కోసం భారత్‌, అమెరికా కలిసి పని చేస్తాయన్నారు. వ్యూహాత్మక ఇండోఫసిపిక్‌ రీజియన్‌పై పట్టు సాధించేందుకు చైనా యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీజియన్‌ పరిధిలోని వివిధ దేశాలతో ప్రాదేశిక విభేదాలు తలెత్తుతున్నాడ్రాగన్‌ వెనకడుగు వేయడం లేదు.. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై పట్టు సాధించేందుకు అమెరికా యత్నిస్తుండటాన్ని చైనా వ్యతిరేకిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని