Kashmir: కశ్మీర్‌ అంశంలో జోక్యం చేసుకోకండి

జమ్మూకశ్మీర్‌ అంశాన్ని చైనా-పాక్‌ ప్రస్తావించడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. చైనా ప్రధాని లా కియాంగ్‌తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

Published : 14 Jun 2024 05:06 IST

పాక్, చైనాలకు భారత్‌ హెచ్చరిక

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ అంశాన్ని చైనా-పాక్‌ ప్రస్తావించడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. చైనా ప్రధాని లా కియాంగ్‌తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో కశ్మీర్‌పై వ్యాఖ్యలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌ ప్రకారం కశ్మీర్‌ అంశాన్ని పరిష్కరించుకోవాలని చైనా పేర్కొంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ ‘‘కశ్మీర్‌ అంశంలో మా మా విధానం ఎప్పుడూ నిలకడగా ఉంది. సంబంధిత పక్షాలకు ఈ విషయం తెలుసు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగం. వీటిపై వ్యాఖ్యానించే అధికారం వేరే దేశానికి లేదు’’ అని పేర్కొన్నారు. భారత్‌కు చెందిన పాక్‌ ఆక్రమిత ప్రాంతాల్లో చైనా ప్రాజెక్టుల అంశమూ సంయుక్త ప్రకటనలో ఉండటాన్ని జైస్వాల్‌ తప్పుపట్టారు. చైనా పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)లో భాగంగా ఈ ప్రాంతాల్లో ప్రాజెక్టులను చైనా నిర్మిస్తోంది. ఇస్లామాబాద్‌ ఆక్రమణలను చట్టబద్ధం చేసే ప్రక్రియను ఏ దేశాలు చేపట్టినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని రణ్‌ధీర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని