Army chief: భవిష్యత్తులోనూ ఉగ్రవాదం వంటి సవాళ్లున్నా కానీ..!

ఉగ్రదాడులను ముందుగానే గుర్తించి, అడ్డుకోవడంలో భద్రతా బలగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆర్మీ చీఫ్(Army chief General Manoj Pande) కొనియాడారు. ఈ మేరకు హరియాణాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

Published : 22 Mar 2023 00:50 IST

గురుగ్రామ్‌: భవిష్యత్తులోనూ భారత్‌ ఉగ్రవాదం, అంతర్గత భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంటుందని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే(Army chief General Manoj Pande) హెచ్చరించారు. అలాగే వాటిని భద్రతా బలగాలు ఐకమత్యంతో అడ్డుకుంటాయని వెల్లడించారు. నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(NSG) నిర్వహించిన ఆల్‌ ఇండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్ ప్రారంభ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. హరియాణాలోని మానేసర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 

‘ఉగ్రవాదం, అంతర్గతంగా భద్రతాపరమైన పరిస్థితులు మనదేశంపై వివిధ రూపాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. వీటిని ఐకమత్యంగా ఎదుర్కొంటున్నాం. దీనివల్ల పలు రాష్ట్రాల్లో భద్రతాపరమైన పరిస్థితులు మెరుగవుతున్నాయి. కాకపోతే ఈ సవాళ్లు భవిష్యత్తులోనూ, అలాగే దీర్ఘకాలం కొనసాగుతాయి. అందులో కొన్ని పరోక్షంగా, మరికొన్ని రహస్యంగా ఉంటాయి. దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికలను విస్మరించకూడదు. ఎన్నో ఈ తరహా ఘటనలను నిఘా వర్గాలు ముందుగానే గుర్తించి, అడ్డుకున్నాయి’ అంటూ భద్రతా బలగాల పనితీరును ప్రశంసించారు. అలాగే బాంబులను గుర్తించి నిర్వీర్యం చేయడం, స్నైపింగ్, డ్రోన్లను ఎదుర్కోవడం వంటి విషయాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఎన్‌ఎస్‌జీ(NSG)ని అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని