
డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్: జావడేకర్
దిల్లీ: దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రమంత్రి, భాజపా సీనియర్ నేత ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ సిద్ధం చేసిందని చెప్పారు. డిసెంబర్ చివరినాటికి 108 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ అందుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌పై జావడేకర్ విమర్శలు గుప్పించారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమంలో గందరగోళం నెలకొందన్నారు. మే 1 నుంచి 18-44 వయసువారికి టీకా వేసేందుకు ఉద్దేశించిన కోటాను ఆ రాష్ట్రాలు తీసుకోలేదని ఆరోపించారు. కొవిడ్ కట్టడిలో కేంద్రం విఫలమైందని, 3 శాతం ప్రజలకు కూడా ఇంకా వ్యాక్సిన్ పూర్తవ్వలేదంటూ రాహుల్ విమర్శలు చేసిన నేపథ్యంలో జావడేకర్ ఈ విధంగా స్పందించారు.
అలాగే టూల్ కిట్ వ్యవహారంపైనా జావడేకర్ స్పందించారు. రాహుల్ వాడిన భాష చూస్తుంటే ఆ టూల్‌కిట్ కాంగ్రెస్ రూపొందించిందనేది స్పష్టమవుతోందని చెప్పారు. ‘మీరు వాడే భాష, శైలి చూస్తుంటే టూల్ కిట్ మీరే రూపొందించారని అర్థమవుతోంది. ప్రజల్లో భయాందోళన నెలకొల్పడానికి మీరు చేస్తున్న రాజకీయంలో భాగమే ఇది. టూల్‌కిట్ కాంగ్రెస్‌దే అనడానికి ఇంతకుమించిన సాక్ష్యాలు అవసరం లేదు’’ అని జావడేకర్ అన్నారు. దేశీయంగా తయారైన టీకాపై లేనిపోని సందేహాలు అప్పట్లో లేవనెత్తారని, అదే వ్యక్తులు ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.