Family Planning: కుటుంబ నియంత్రణలో భారత్‌కు ‘ఎక్సెల్‌ అవార్డ్‌-2022’

కుటుంబ నియంత్రణలో అత్యాధునిక విధానాల వినియోగం, నాయకత్వానికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘ఎక్సెల్‌ అవార్డ్‌-2022’ భారత్‌ను వరించింది.

Updated : 19 Nov 2022 08:42 IST

దిల్లీ: కుటుంబ నియంత్రణలో అత్యాధునిక విధానాల వినియోగం, నాయకత్వానికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘ఎక్సెల్‌ అవార్డ్‌-2022’ భారత్‌ను వరించింది. అత్యాధునిక, అత్యంత నాణ్యమైన కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తున్న దేశాల విభాగంలో ఒక్క భారత్‌ మాత్రమే ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కుటుంబ నియంత్రణ సదస్సు (ఐసీఎఫ్‌పీ2022) సమావేశంలో ఈ అవార్డును ప్రకటించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శుక్రవారం ట్విటర్‌లో వెల్లడించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం- దేశంలో 2015-16లో 54% ఉన్న గర్భనిరోధక రేటు (కాంట్రాసెప్టివ్‌ ప్రివలెన్స్‌ రేట్‌)... 2019-20 నాటికి 67 శాతానికి చేరింది.
* దేశంలో పునరుత్పత్తి సామర్థ్యమున్న 15-49 ఏళ్ల వయసు వివాహితుల్లో కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించినవారు (డిమాండ్‌ సాటిస్ఫైడ్‌) 2015-16లో 66% ఉండగా, 2019-20 నాటికి అది 76 శాతానికి చేరుకొంది.
* సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఈ రేటు 75 శాతానికి చేరుకోవాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే భారత్‌ దీన్ని అధిగమించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని