India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్(Corona Virus) మరోసారి కలవరానికి గురిచేస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

Updated : 30 Mar 2023 15:53 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (Corona virus) మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అమాంతం 40 శాతం పెరిగి.. 3,016కి చేరాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ (Union health ministry) వెల్లడించింది. నిన్న 1,10,522 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఈస్థాయి పెరుగుదల కనిపించింది. ముందురోజు ఈ కేసుల సంఖ్య 2,151గా ఉంది. 

కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు (active cases) 13,509(0.03శాతం)కి చేరాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతానికి చేరడం కలవరానికి గురిచేస్తోంది. కేంద్రం కొత్తగా 14 మరణాలను ప్రకటించింది. అందులో కేరళ నుంచి ఎనిమిది మరణాలు వచ్చాయి. అవి సవరించిన గణాంకాలు. ఇక 2021 నుంచి 220.65 కోట్ల టీకా డోసులు పంపిణీ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

అత్యవసరంగా సమావేశం కానున్న దిల్లీ ప్రభుత్వం..

బుధవారం దిల్లీలో 300 కరోనా (Corona virus)కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది ఆగస్టు 31 తర్వాత.. ఇంత మొత్తంలో కేసులు నమోదయ్యాయి. దాంతో దిల్లీ ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. వైద్య నిపుణులు, వైద్య శాఖ అధికారులతో ఇవాళ దిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని