Bengaluru: కరోనాపై పోరులో భారత సైన్యం

కరోనాపై పోరులో భారతసైన్యం తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని  ఉల్సూర్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 100 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

Updated : 19 Oct 2022 11:33 IST

బెంగళూరులో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు 

బెంగళూరు: కరోనాపై పోరులో భారతసైన్యం తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఉల్సూర్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో 100 పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కర్ణాటక, కేరళ సబ్‌ డివిజన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ జేవీ ప్రసాద్‌ తెలిపారు. కొవిడ్‌ ప్రభావం స్వల్పంగా ఉన్న వారి కోసం దీనిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘యునైటెడ్‌ సిక్స్’ అనే స్వచ్ఛంద సంస్థ, బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) సంయుక్త సహకారంతో  ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రంలో 55 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉండగా..  ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లను యునైటెడ్‌ సిక్స్ అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్‌ బారిన పడినవారిని కాపాడేందుకు ఇలాంటి చాలా సెంటర్లను సైన్యం  ఇటీవల ఏర్పాటు చేసింది. మిలిటరీ, కమాండ్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకల సంఖ్యను 1800 నుంచి 4 వేలకు ఆర్మీ పెంచింది. వాటిలో 93 శాతం ఆసుపత్రుల్లో సొంత ఉత్పత్తి కేంద్రాల ద్వారానే  ఆరు వారాలుగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నట్లు భారత సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఎం ఎం నరవణె ఇటీవల తెలిపారు. కర్ణాటక ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,183 పాజిటివ్‌  కేసులు, 451 మరణాలు నమోదవగా..  61,766 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ప్రకటించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని