Updated : 01 Nov 2021 20:01 IST

Corona: కొవిడ్‌ ఆంక్షలున్నా.. ఈ దేశాలకు వెళ్లవచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా, లాక్‌డౌన్‌తో నెలల తరబడి ఇంటికే పరిమితమైన ప్రజలు.. కొవిడ్‌ ఆంక్షల నుంచి కాస్త వెసులుబాటు దొరికినా విహారయాత్రకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే దేశీయంగా కొన్ని చోట్ల పర్యాటక రంగం సందర్శకులకు ఆహ్వానం పలుకుతుండగా.. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే కరోనా కట్టడి కోసం చాలా దేశాల్లో విధించిన విమాన రాకపోకలపై నిషేధం ఇంకా కొనసాగుతోంది. భారత్‌లోనూ నవంబర్‌ 30 వరకు విమానయానంపై ఆంక్షలు ఉన్నాయి. అయినా.. టూరిస్టులకు ఒక శుభవార్త ఉంది. అదేంటంటే.. భారత ప్రభుత్వం 28 దేశాలతో ‘ఎయిర్‌ బబుల్‌’ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. ఆయా దేశాలకు ప్రత్యేక విమానసర్వీసులను నడుపుతున్నారు. 

ఏయే దేశాలకు వెళ్లొచ్చు...

యూఎస్‌ఏ, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, భూటాన్‌, కువైట్‌, మాల్దీవులు, నేపాల్‌, నెదర్లాండ్‌, యూఏఈ, కువైట్‌, శ్రీలంక, బహ్రెయిన్‌, ఖతర్‌, ఒమన్‌, రువాండా, రష్యా, కెనడా, సెషెల్స్‌, ఇరాక్‌, నైజీరియా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, కెన్యా, టాంజానియా, ఉజ్బెకిస్థాన్‌ దేశాల మధ్య విమాన సేవల్ని అందించేందుకు భారత ప్రభుత్వం ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇవి కాకుండా ఇటలీ, స్పెయిన్‌, టర్కీ, ఈజిప్ట్‌, థాయ్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌ దేశాలు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తయిన భారతీయులను అనుమతిస్తున్నాయి. అయితే ఈ దేశాలకు వెళ్లాలంటే.. కొవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందే. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు తెలిపే ధ్రువపత్రం లేదా నెగెటివ్‌ ఆర్‌టీపీసీఆర్‌ కరోనా రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. కొన్ని దేశాల్లో ప్రయాణికులు విమానం దిగిన వెంటనే కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధనలూ ఉన్నాయి. పూర్తి వివరాలను పౌర విమానయానశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. వాటిని పరిశీలించి, కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆయా దేశాల్లో పర్యటించే అవకాశముంది. మరెందుకు ఆలస్యం.. మీరు వెళ్లాలనుకునే దేశం ఈ జాబితాలో ఉంటే.. విహారయాత్రకు సిద్ధమైపోండి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని