America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!

అమెరికాలో (America) అశ్లీల వీడియోలు సరఫరా చేస్తున్న అభియోగాలపై ఓ విహార నౌకలో పనిచేస్తోన్న భారతీయుడికి  దాదాపు16ఏళ్ల జైలు శిక్ష పడింది. 

Published : 25 Mar 2023 01:49 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ క్రూయిజ్‌ నౌకలో పనిచేస్తోన్న ఓ భారతీయుడిపై అశ్లీల చిత్రాలను సరఫరా చేస్తున్నాడనే అభియోగాలు నమోదయ్యాయి.  దర్యాప్తులో ఇవి నిరూపణ కావడంతో ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు అతడికి 188 నెలల జైలు శిక్ష విధించింది. ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. గోవాకు చెందిన అంగెలో విక్టర్‌ ఫెర్నాండెజ్‌ (34) అనే అమెరికాలోని ఓ  విహార నౌకలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2022లో చిన్నారులకు సంబంధించిన కొన్ని అశ్లీల వీడియోలను మెసేజింగ్‌ యాప్‌ ద్వారా డానియల్‌ స్కాట్‌ అనే వ్యక్తికి పంపించాడు. అంతేకాకుండా చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తించడంపై మరో గుర్తు తెలియని వ్యక్తితో సంప్రదింపులు కూడా జరిపినట్లు వెల్లడైంది. ఈ కేసులో విక్టర్‌ ఫెర్నాండెజ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి 188 నెలల పాటు జైలు శిక్ష విధించింది. మరోవైపు, ఇదే ఈ  కేసులో డానియల్‌ స్కాట్‌ సైతం నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీంతో అతడికి 2022 డిసెంబర్‌లోనే కోర్టు శిక్ష విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని