Taliban: భారత్‌ చేరుకున్న అఫ్గాన్‌లోని దౌత్యసిబ్బంది

అఫ్గానిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం

Updated : 11 Jul 2021 12:31 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ భూభాగంపై తాలిబన్లు పట్టుబిగుస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ప్రాంతంలోని కీలక పట్టణం కాందహార్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం నుంచి మన దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని శనివారం రాత్రి ప్రత్యేక వాయుసేన విమానంలో భారత్‌కు తీసుకొచ్చింది. అయితే, భారత కాన్సులేట్‌ను మాత్రం ఇంకా మూసివేయలేదని స్పష్టం చేసింది. పరిస్థితులు గందరగోళంగా ఉన్న నేపథ్యంలో మన సిబ్బందిని తాత్కాలికంగా  అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. 

దక్షిణ ప్రాంతంలో కాందహార్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు పట్టుబిగించారు. ఏ క్షణంలోనైనా మూకలు నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్గాన్ భద్రతా బలగాలతో భీకర పోరు జరిగే అవకాశం ఉంది. అలాగే తాలిబన్ల నీడలో ఆశ్రయం పొందుతున్న లష్కరే తోయిబా ఉగ్రమూకల ప్రాబల్యం దక్షిణ ప్రాంతంలో అధికం. తాలిబన్లతో కలిసి వీరంతా అఫ్గాన్‌ సేనలపై దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించిన భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని