Indian Navy: నేవీ హెలికాప్టర్.. నీటిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్
భారత నౌకాదళానికి (Indian Navy) చెందిన ఓ హెలికాప్టర్ (helicopter)ను అత్యవసరంగా నీటిపై దించారు. ఈ ఘటన నుంచి ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ముంబయి: భారత నౌకాదళానికి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌కు ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌ను అత్యవసరంగా నీటిపై దించారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.
నేవీకి చెందిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) రోజువారీ శిక్షణలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు నేవీ అధికారులు తెలిపారు. దీంతో హెలికాప్టర్‌ను ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఘటన గురించి సమాచారం అందగానే రంగంలోకి దిగిన అధికారులు.. పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి వారిని కాపాడారని నౌకాదళ అధికార ప్రతినిధి ట్విటర్లో వెల్లడించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Telangana News: పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
India News
Sarus crane: కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
World News
పశ్చిమ అంటార్కిటికాలో 3 లక్షల టన్నుల మంచు మాయం
-
Education News
పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా?
-
Crime News
vizag: విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
-
India News
వలస కూలీకి డ్రీమ్ 11తో రూ.కోటి జాక్‌పాట్