
Ramayan Express: వెయిటర్ల వేషధారణ మార్పు.. మారని మాస్కులు, చేతి గ్లౌజుల రంగు!
ఇండోర్: రామాయణ సర్క్యూట్ ప్రత్యేక రైళ్లలో వివాదాస్పదమైన వెయిటర్ల డ్రెస్ కోడ్ను ఐఆర్సీటీసీ ఉపసంహరించుకుంది. వెయిటర్ల వేషధారణపై విమర్శలు రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లలో ఆహారాన్ని అందిస్తున్నవారంతా సాధువుల వేషధారణలో ఉండటం విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రైల్వేశాఖ తీరును అఖాడా పరిషత్ తీవ్రంగా తప్పుబట్టింది. వెయిటర్లు ధరించిన కాషాయ వస్త్రాలు, తలపాగా, రుద్రాక్ష మాలలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెయిటర్ల వస్త్రధారణ వెంటనే మార్చాలని.. లేదంటే రామాయణ సర్క్యూట్ రైళ్లను అడ్డుకుంటామని రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సిబ్బంది డ్రెస్ కోడ్ను రైల్వేశాఖ మార్చింది. ఇక నుంచి సాధారణ చొక్కా, ప్యాంట్, సంప్రదాయ తలపాగా ధరించి, యాత్రికులకు వెయిటర్లు సేవలందిస్తారని తెలిపింది. కాషాయ రంగు మాస్కులు, చేతి గ్లౌజుల్లో మార్పులు చేయలేదు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.