Indian railway: రైలు టికెట్లపై రాయితీ పొడిగింపు

టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.

Published : 14 Jun 2021 15:17 IST

ప్రకటించిన రైల్వే శాఖ

దిల్లీ: టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.  డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 డిసెంబరు నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొనే వారితో పాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా యూపీఐ చెల్లింపులు చేసుకొనే సౌకర్యం అందుబాటులో ఉంది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ ( బీహెచ్‌ఐఎం) ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది. ఈ విధంగా చెల్లింపులు చేసుకున్న వారికి టికెట్‌ రుసుముపై 5 శాతం రాయితీని అందిస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని 2022 జూన్‌ వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని