Squid Game: ‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో నిర్వహించిన పోటీలో ఓ భారతీయుడు విజేతగా నిలిచి నగదు బహుమతి అందుకున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ స్ఫూర్తితో నిర్వహించిన పోటీలో ఓ భారతీయుడు విజేతగా నిలిచి నగదు బహుమతి అందుకున్నాడు. తమిళనాడుకు చెందిన సెల్వం అరుముగం(42) సింగపూర్‌లో ‘పొల్లీసమ్ ఇంజినీరింగ్’ అనే సంస్థలో రిగ్గర్, సిగ్నల్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఆ సంస్థ ఇటీవల 210 మంది ఉద్యోగులకు ‘స్క్విడ్ గేమ్’ తరహా పోటీని నిర్వహించింది. ఆ వెబ్ సిరీస్‌లో పాత్రధారులు ధరించినట్లే పోటీదారులు ఆకుపచ్చ, నిర్వాహకులు ఎరుపు దుస్తులు ధరించారు. ‘గ్రీన్ లైట్, రెడ్ లైట్’ ఆటను సెల్వం చాకచక్యంగా ఆడి విజయం సాధించాడు. దీంతో సంస్థ అతడికి 18,888 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.11.50 లక్షలు) అందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Visakhapatnam: విశాఖలో తెదేపా మెరుపు నిరసన
-
Rahul Gandhi: బిలాస్పూర్ To రాయ్‌పూర్.. ట్రైన్లో ప్రయాణించిన రాహుల్
-
Singer Damini: బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు