
Afghan Crisis: కాబుల్ నుంచి భారతీయుల తరలింపు
దిల్లీ: కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాబుల్ విమానాశ్రయం నుంచి శనివారం కొంతమంది భారతీయులను వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొస్తున్నారు. ఈ ఉదయం 85 మందికి పైగా భారత పౌరులతో సి-130జె విమానం కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విమానం ఇంధనం నింపుకొనేందుకు తజకిస్థాన్‌లో దిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇక వాయుసేనకు చెందిన మరో సి-17 విమానం కూడా కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉంది. భారతీయులను తీసుకుని ఆ విమానం కూడా త్వరలోనే స్వదేశానికి బయల్దేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఫ్గాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించిన విషయం తెలిసిందే.
తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత ఆ దేశ గగనతలాన్ని మూసివేశారు. దీంతో భారతీయుల తరలింపు ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. అయితే ఆ తర్వాత అమెరికా దళాల సహకారంతో భారత్ ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపునకు ఏర్పాట్లు చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.