Saudi Visa: భారతీయులకు సౌదీ గుడ్‌న్యూస్‌.. వీసాకు ఆ క్లియరెన్స్‌ అక్కర్లేదు

సౌదీ అరేబియా భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సౌదీ వీసా కోసం భారతీయులు ఇకపై పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదని ఆ దేశం స్పష్టంచేసింది.

Published : 18 Nov 2022 01:51 IST

దిల్లీ:  సౌదీ అరేబియా (Saudi Visa) భారతీయులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సౌదీ వెళ్లాలనుకునే భారతీయులు ఇకపై వీసా కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాల్సిన అవసరం లేదని ఆ దేశం స్పష్టంచేసింది. ఈ మేరకు భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్‌తో తమ దేశానికి ఉన్న బలమైన వ్యూహాత్మక బంధం దృష్ట్యా వీసాల కోసం పోలీస్‌ క్లియరెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనిద్వారా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని పేర్కొంది.

సౌదీ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వీసా అప్లికేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. పర్యాటక సంస్థలకు పని సులభతరం కానుంది. ఆ మేరకు టూరిస్టులకు డాక్యుమెంట్ల భారం తగ్గనుంది. ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది భారతీయులు ప్రశాంతంగా సౌదీ అరేబియాలో జీవిస్తున్నారని ఆ దేశం తెలిపింది. వాస్తవానికి సౌదీ రాజు మహ్మద్‌ బిన్‌ సాల్మన్‌ ఈ నెల భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని