మొబైళ్లకు అతుక్కుపోతున్నాం.. మనమే టాప్‌

స్మార్ట్‌ఫోన్లపై భారతీయులు వెచ్చిస్తున్న సగటు సమయం ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా ఉన్నట్లు ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. దేశంలో తక్కువ నిడివి గల వీడియోలు చూస్తున్న సమయం....

Published : 12 Feb 2021 13:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్లపై భారతీయులు వెచ్చిస్తున్న సగటు సమయం ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా ఉన్నట్లు ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. దేశంలో తక్కువ నిడివి గల వీడియోలు చూస్తున్న సమయం 2025 నాటికి నాలుగు రెట్లు పెరగనుందని పేర్కొంది. ‘మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇండియా ట్రాఫిక్‌ ఇండెక్స్‌-2021’ నివేదిక ప్రకారం బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో భారత్‌.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. మరోవైపు భారత్‌లో గడిచిన ఐదేళ్లలో డేటా వినియోగం 60 రెట్లు పెరిగినట్లు తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ స్థాయిలో పెరుగుదల నమోదుకావడం ప్రపంచంలోనే అత్యధికమని నోకియా మార్కెటింగ్‌ చీఫ్‌ అమిత్‌ మార్వా అన్నారు. 2015లో దేశవ్యాప్తంగా 164 పెటా బైట్ల డేటా వినియోగించగా డిసెంబర్‌ 2020 నాటికి అది 10 వేల పెటా బైట్లకు చేరినట్లు తెలిపారు. ఒక వ్యక్తి నెలవారీ సగటు డేటా వినియోగం గడిచిన ఐదేళ్లలో 76 శాతం మేర పెరిగినట్లు అమిత్‌ మార్వా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఒక వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌పై వెచ్చించే సమయం 4 రెట్లు పెరిగింది. ఓ వ్యక్తి సగటున రోజులో 5 గంటలు మొబైల్‌ ఫోన్‌కు అతుక్కుపోతున్నట్లు తేలింది.

ఇవీ చదవండి...

20శాతం భారత భూగర్భజలాల్లో అర్సెనిక్‌

ఊబకాయానికి విప్లవాత్మక ఔషధం!
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని