Covid Deaths: 43% తగ్గిన కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు దిగివస్తున్న నేపథ్యంలో మరణాలు కూడా భారీగా తగ్గుతున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో 43 శాతం మరణాలు తగ్గాయి. గత నెలతో పోలిస్తే జూన్‌లో కొవిడ్‌ కేసులు కూడా 75 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి....

Published : 30 Jun 2021 20:18 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు దిగివస్తున్న నేపథ్యంలో మరణాలు కూడా భారీగా తగ్గుతున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో 43 శాతం మరణాలు తగ్గాయి. గత నెలతో పోలిస్తే జూన్‌లో కొవిడ్‌ కేసులు కూడా 75 శాతం తగ్గినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  మే నెలలో 88.82 లక్షల మందికి కొవిడ్‌ సోకగా.. 1.17 లక్షల మంది ప్రాణాలు విడిచారు. కాగా జూన్‌లో 21.87 లక్షల మంది వైరస్‌ బారిన పడగా.. 66,550 మంది మృతిచెందారు.

మే నెలలో కరోనా రెండో దశ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కొద్దిరోజులపాటు ప్రతిరోజు 4 లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదవగా.. నాలుగు వేలకుపైగా మరణాలు సంభవించాయి. కాగా మే నెల మధ్య నుంచి కేసుల్లో తగ్గుదల కనిపించింది. చాలా రాష్ట్రాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవగా ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అవి పదుల సంఖ్యకు దిగివచ్చాయి. దేశ రాజధాని దిల్లీలో ప్రళయం సృష్టించిన మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టింది.

మంగళవారం దేశంలో 45,951 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 817 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసులు 3,03,62,848కి చేరగా..3,98,454 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీల కేసులు 5,37,064కి చేరాయి. నిన్న 60,729 మంది కోలుకున్నారు. క్రియాశీల రేటు 1.82 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది. మొత్తం రికవరీలు 2.94కోట్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు