Nitin Gadkari: దేశంలో అలాంటి హైవే నిర్మించాలనేది నా కల: గడ్కరీ

మణిపూర్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కశ్మీర్‌లలో రోప్‌ వే కేబుల్స్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 47 ప్రతిపాదనలు వచ్చాయన్నారు....

Published : 15 Mar 2022 15:25 IST

దిల్లీ: దేశంలోనే తొలిసారి దిల్లీ నుంచి జైపూర్‌కు ఎలక్ట్రిక్‌ హైవే నిర్మించాలనేది తన కల అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. మంగళవారం ఆయన దిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మణిపూర్‌, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కశ్మీర్‌లలో రోప్‌ వే కేబుల్స్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 47 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. తమ మంత్రిత్వశాఖ వద్ద బడ్జెట్‌కు కొదవలేదనీ.. మార్కెట్‌ కూడా అందుకనుగుణంగానే ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, 2022-23 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వశాఖకు రూ.1.99లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీంట్లో దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి కోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కే 1.34లక్షల కోట్లు కేటాయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని