UN Geneva: ఐరాస భవనం ముందు భారత వ్యతిరేక పోస్టర్ల కలకలం..!

స్విట్జర్లాండ్‌ జెనీవాలోని ఐరాస భవనం ముందు దేశ వ్యతిరేక పోస్టర్లు ప్రదర్శించడంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. స్విస్‌ రాయబారిని పిలిపించి వివరణ కోరింది.

Published : 05 Mar 2023 23:25 IST

దిల్లీ: స్విట్జర్లాండ్‌(Switzerland) రాజధాని జెనీవాలోని ఐరాస(UN) భవనం ముందు భారత వ్యతిరేక పోస్టర్లు(Anti India Posters) ప్రదర్శించడం కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రిత్వశాఖ(MEA).. ఆదివారం భారత్‌లోని స్విట్జర్లాండ్‌ రాయబారి(Swiss Ambassador)ని పిలిపించి వివరణ కోరింది. ఈ సందర్భంగా తాజా వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భారత్‌ ఆందోళనలను అంతే తీవ్రతతో తమ దేశం దృష్టికి తీసుకెళ్తానని విదేశాంగ శాఖకు స్విస్ రాయబారి హామీ ఇచ్చినట్లు సమాచారం.

‘విదేశాంగ శాఖ పశ్చిమ విభాగం సెక్రెటరీ ఆదివారం స్విస్ రాయబారి రాల్ఫ్‌ హెక్‌నర్‌ ని పిలిపించారు. జెనీవాలోని ఐరాస భవనం ముందు నిరాధారమైన, దురుద్దేశపూరిత భారత వ్యతిరేక పోస్టర్లను ప్రదర్శించిన విషయంపై నిరసన తెలిపారు’ ఓ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని తమ దేశం దృష్టికి తీసుకెళ్తానని స్విట్జర్లాండ్‌ రాయబారి తెలిపినట్లు చెప్పారు. ‘పోస్టర్లు ప్రదర్శించిన ప్రాంతం అందరికి కేటాయించిన స్థలంలో భాగం. అయితే, వాటిలోని అంశాలను తాము ఏ విధంగానూ ప్రోత్సహించమని, అవి తమ దేశ వైఖరిని ప్రతిబింబించవు’ అని రాయబారి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని