అవినీతిలో మరింత దిగజారి 86వ స్థానంలో..

ప్రపంచ అవినీతి సూచీలో భారత్‌ 86వ స్థానంలో నిలిచింది. అవినీతి సూచీ 2020 పేరుతో ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్‌ విడుదల చేసిన నివేదికలో 2019 కంటే భారత్‌ ఆరు స్థానాలు దిగజారింది....

Published : 29 Jan 2021 21:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ అవినీతి సూచీలో భారత్‌ 86వ స్థానంలో నిలిచింది. అవినీతి సూచీ 2020 పేరుతో ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్‌ విడుదల చేసిన నివేదికలో 2019 కంటే భారత్‌ ఆరు స్థానాలు దిగజారింది. 2019లో 80వ స్థానంలో ఉన్న భారత్‌ ప్రస్తుతం ఆరు స్థానాలు తగ్గి 86వ ర్యాంకులో నిలిచింది. ప్రపంచంలోని 180 దేశాల్లో అవినీతి స్థాయిపై ఏటా ట్రాన్స్‌ఫరెన్సీ ఇంటర్నేషనల్‌ ఓ నివేదికను రూపొందిస్తుంది. కాగా ఏ దేశంలో అవినీతి ఎక్కువగా ఉందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని దాని ద్వారా వచ్చిన స్కోరు ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది. ఈ స్కోరు సున్నా నుంచి 100 వరకు ఉంటుంది. సున్నా సాధించిన దేశంలో అవినీతి అత్యధికంగా ఉందని అర్థం. అవినీతి తక్కువగా ఉన్న దేశాలకు తక్కువ ర్యాంకులిస్తూ ఎక్కువ ఉన్న దేశాలకు ఎక్కువ ర్యాంకులిస్తోంది ఈ సంస్థ. ఈ విభాగంలో భారత్‌ గతేడాది 41 స్కోరు సాధించగా ఈ ఏడాది ఓ పాయింట్‌ కోల్పోయి 40 స్కోరుతో 86వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 88 స్కోరు సాధించిన న్యూజిలాండ్‌, డెన్మార్క్‌ సంయుక్తంగా మొదటిస్థానంలో నిలిచాయి. సోమాలియా, సూడాన్‌ దేశాలు 12 స్కోరు, 179వ ర్యాంకుతో చివరి వరుసలో ఉన్నాయి.

ఇవీ చదవండి...

పాక్‌ సుప్రీంకోర్టు తీర్పుపై అమెరికా ఆగ్రహం!

ద్వైపాక్షిక బంధానికి అష్టోత్తరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని