SecondWaveతో 70 లక్షల ఉద్యోగాలకు ముప్పు

Unemployment Rate: భారత్‌లో నిరుద్యోగాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత పెంచే ప్రమాదం పొంచి ఉంది.  

Updated : 04 May 2021 16:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో నిరుద్యోగాన్ని కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత పెంచే ప్రమాదం పొంచి ఉంది. తాజాగా ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు ఎనిమిది శాతం పెరిగి నాలుగు నెలల అత్యధికానికి చేరింది. భవిష్యత్తులో లాక్‌డౌన్‌లు, ఆంక్షలు తీవ్రం కానుండటంతో పరిస్థితి ఆశాజనకంగా లేదు. మార్చిలో నిరుద్యోగ రేటు 6.5 శాతం ఉండగా.. తాజాగా అది 7.97 శాతానికి చేరింది. కిందటి నెలలోనే దాదాపు 70 లక్షల కొలువులు పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్ ఇండియన్‌ ఎకానమీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ పేర్కొంది. 

‘‘ఉద్యోగాల లభ్యతలో కొరత నెలకొంది. ఇది లాక్‌డౌన్‌ల వల్ల కావచ్చు’’ అని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో మే నెలలో కూడా ఒత్తిడి కొనసాగుతుందని పేర్కొన్నారు. బలహీనమైన ఆర్థిక అంచనాల నేపథ్యంలో భారత్‌  ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలామంది ఆర్థికవేత్తలు తమ అంచనాలను సవరించారు. రాష్ట్రల వారీగా ఆంక్షలు పెరిగే కొద్దీ వీటిల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బార్ల్కెస్‌బ్యాంక్‌ పీఎల్‌సీ  సోమవారం అంచనాలను సవరించింది. భారత్‌లో పెరుగుతున్న కేసులు, మందగించిన వ్యాక్సినేషన్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని దెబ్బతీస్తాయని అంచనా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని