IIT Kanpur: ఐఐటీ కాన్పుర్‌కు రూ.100కోట్ల విరాళం.. ఎవరిచ్చారంటే..?

తాను చదువుకున్న విద్యాసంస్థపై ప్రేమతో ఏకంగా రూ.100కోట్ల విరాళమిచ్చారో పూర్వ విద్యార్థి. ఆయన మరెవరో కాదు ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్‌.

Published : 05 Apr 2022 12:34 IST

ముంబయి: తాను చదువుకున్న విద్యాసంస్థపై ప్రేమతో ఏకంగా రూ.100కోట్ల విరాళమిచ్చారో పూర్వ విద్యార్థి. ఆయన మరెవరో కాదు ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్‌. ఐఐటీ కాన్పుర్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆయన.. తన వంతు సాయంగా ఈ వ్యక్తిగత విరాళాన్ని ప్రకటించడం విశేషం. 

‘‘ఐఐటీ కాన్పుర్‌ ప్రాంగణంలో స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఏర్పాటుకు మా పూర్వ విద్యార్థి, ఇండిగో సహ వ్యవస్థాపకులు రాకేశ్‌ గంగ్వాల్‌ మద్దతు ప్రకటించారు. ఇందుకోసం రూ.100 కోట్ల వ్యక్తిగత విరాళం ప్రకటించారు. రాకేశ్ ఉదారతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని ఐఐటీ కాన్పుర్‌ డైరెక్టర్‌ అభయ్‌ కరాండికర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అంతేగాక, ఈ స్కూల్‌ పూర్తయిన తర్వాత గంగ్వాల్‌ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా చేరుతారని తెలిపారు. 

ఐఐటీ కాన్పుర్‌లో మెడికల్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ స్కూల్‌ను ప్రారంభించనున్నట్లు విద్యాసంస్థ గతేడాది ప్రకటించింది. ఈ స్కూల్‌లో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అకాడమిక్‌ బ్లాక్‌, హాస్టల్, సర్వీస్‌ బ్లాక్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటు ఔషధాలపై పరిశోధనలు చేసేందుకు సెంటర్స్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, రీసెర్చ్‌ సెంటర్స్‌ వంటివి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న 3-5 ఏళ్లలో ఈ స్కూల్‌ను పూర్తి చేయనున్నట్లు ఐఐటీ కాన్పుర్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు