IndiGo: ఇండిగో విమానానికి మెడికల్‌ ఎమర్జెన్సీ.. ప్రయాణికుడి మృతి

ఇండిగో (IndiGo) విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసినా.. దురదృష్టవశాత్తూ అతడు ప్రాణాలు కోల్పోవడం విచారకరం.

Published : 13 Mar 2023 12:14 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి దోహా (ఖతార్‌) బయల్దేరిన ఓ ఇండిగో (IndiGo) విమానంలో మెడికల్‌ ఎమర్జెన్సీ  (medical emergency) చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి (Passenger) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెంటనే దారిమళ్లించి పాకిస్థాన్‌లోని కరాచీ (Karachi)లో అత్యవసరంగా దించేశారు. ల్యాండ్‌ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు మెడికల్‌ బృందం ఆ ప్రయాణికుడిని పరీక్షించగా.. అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించింది.

దీంతో ఆ ప్రయాణికుడి మృతదేహంతో సహా విమానం తిరిగి దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ ఘటనపై ఇండిగో (IndiGo) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. విమానంలోని ఇతర ప్రయాణికులను దోహా పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. మృతుడు నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లా అని గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై పూర్తి స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని