Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది.
ఇంటర్నెట్‌డెస్క్: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి రామేశ్వర్ తెలి, మరో ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని గువహాటి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం.
దీనిపై మీడియాతో టెలిఫోన్‌లో రామేశ్వర్ తెలి మాట్లాడారు. తాను ఇంకా విమానాశ్రయంలోనే ఉన్నట్లు తెలిపారు. ‘‘నేను భాజపా ఎమ్మెల్యే ప్రశాంత్, తెరస్ గొవల్లాతో కలిసి విమానంలో బయల్దేరాను. నాకు దులియాజన్, టింగ్‌ఖాంగ్, టిన్సూకియాలో మూడు సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. మా విమానం గాల్లోకి ఎగిరిన 15-20 నిమిషాల్లో ఉన్న తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉంది. కానీ, సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. మేము సురక్షితంగా ఉన్నాం. మా విమానం నేడు మరోసారి గాల్లోకి ఎగరదని విమానాశ్రయ అధికారులు చెప్పారు’’ అని రామేశ్వర్ వెల్లడించారు. మరోవైపు దిబ్రూగఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయాన్ని గువాహటి ఎయిర్‌పోర్టు వర్గాలు కూడా ధ్రువీకరించాయి. విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: మస్క్‌ను మలిచిన మూడు పుస్తకాలు.. బయోగ్రఫీలో వెల్లడించిన ప్రపంచ కుబేరుడు
-
Chandrababu Arrest: హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దంటే ఎలా?: తెదేపా మహిళా నేత జ్యోత్స్న
-
Chandrababu Arrest: ఏపీలో ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటికలు: నారా బ్రాహ్మణి
-
IRCTC: ఐఆర్సీటీసీ ఆఫర్.. విమాన టికెట్లపై ఆ ఛార్జీలు జీరో
-
Bajaj Pulsar N150: స్పోర్టీ లుక్‌లో కొత్త పల్సర్ N150.. ధర, ఇతర వివరాలివే
-
MGNREGA: బకాయిల వివాదం.. 50లక్షల లెటర్లతో తృణమూల్ సిద్ధం!