INSACOG: భారత్‌లో ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 వేరియంట్లు.. ఇన్సాకాగ్‌ వెల్లడి

ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లయిన ‘బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది.......

Published : 23 May 2022 01:36 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వైరస్‌ ఇంకా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా మరిన్ని ఉపవేరియంట్లు వెలుగుచూస్తున్నాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ ఉపవేరియంట్లు ‘బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. తమిళనాడు, తెలంగాణలో ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది.

తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో ఒమిక్రాన్‌ బీఏ.4ను గుర్తించామని ఇన్సాకాగ్‌ తాజా బులెటిన్‌లో పేర్కొంది. ఆ బాధితురాలికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆమె వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకొన్నట్లు తెలిపింది. తెలంగాణలో 80 ఏళ్ల వృద్ధుడిలో బీఏ.5 బయటపడినట్లు స్పష్టం చేసింది. అతడిలోనూ స్పల్ప లక్షణాలే ఉన్నాయని, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేయించుకున్నట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని