
Instagram: తండ్రి శవపేటిక ముందు హాట్ ఫొటోషూట్.. కుమార్తెపై నెటిజన్లు ఫైర్!
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసి.. నెటిజన్లు ఆకట్టుకుంటూ ఫాలోవర్లను పెంచుకోవడంలో తప్పు లేదు. కానీ.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఫొటోషూట్ చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి. కానీ, ఓ యువతి ఆ జ్ఞానం మరిచి.. తండ్రి అంత్యక్రియల్లో ఫొటోషూట్‌లో పాల్గొని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వివరాళ్లోకి వెళితే..
ఫ్లోరిడాలోని మియామికి చెందిన ఇరవై ఏళ్ల సోషల్ మీడియా సెలబ్రిటీ జేని రివెరా తండ్రి ఇటీవల వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్లో భాగంగా మృతదేహాన్ని శవపేటికలో పెట్టారు. అయితే, శవపేటిక ముందు రివెరా ఫ్యాషన్ దుస్తులు ధరించి.. వివిధ భంగిమల్లో నవ్వుతూ ఫొటోలు దిగి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్లు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి మృతదేహం వద్ద ఫొటోషూట్ ఏంటని మండిపడ్డారు. మరణించిన తండ్రికి కనీసం మర్యాద ఇవ్వలేదని విమర్శించారు. ఆ ఫొటోలు తొలగించి, క్షమాపణ చెప్పకపోతే ఇన్‌స్టాలో ఫాలో అవడం మానేస్తామని కొందరు హెచ్చరించారు. నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలు భరించలేక రివెరా ఏకంగా ఇన్‌స్టా ఖాతాను డియాక్టివేట్ చేసింది. అయితే, నెటిజన్లకు ఎలాంటి వివరణ, క్షమాపణ చెప్పకుండానే ఖాతాను డియాక్టివేట్ చేయడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.