Published : 12 Oct 2020 19:33 IST

బాధితుల వేదన వినకుండా వారిపైనే నిందలా..!

భాజపా నేతలపై పరోక్షంగా మండిపడ్డ ప్రియాంకా గాంధీ

 

దిల్లీ: మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా.. వారి వేదన వినకుండా వారిపైనే నిందలు మోపడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలే మహిళలకు రక్షణగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా బాధితుల బాధలు, వేదన వినకుండా వారిపైనే నిందలు మోపడం సిగ్గుచేటు. అదో పిరికిపంద చర్య. దేశ మహిళలు ఇకపై మౌనంగా ఉండరు. ఒక సోదరిపై నిందలు మోపితే లక్షల మంది మహిళలు గళమెత్తుతారు. వారి పక్షాన నిలబడతారు’ అంటూ ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. మహిళలకు సాటి మహిళలే రక్షణ కల్పించాలని ఈసదర్భంగా పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన దళిత యువతిపై ఓ భాజపా ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యల అనంతరం ప్రియాంకా గాంధీ ఈ విధంగా స్పందించారు. నిందితులతో యువతికి ఎఫైర్‌ ఉందేమో అని సదరు ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పలువురు ప్రతిపక్ష నేతలు, ప్రముఖులు మండిపడ్డారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని