Covid Insurance: కొవిడ్‌ బీమా గడువు మరో 6 నెలలు పొడిగింపు

కొవిడ్‌ సంబంధిత విధుల్లో పాలుపంచుకునే వైద్య, ఆరోగ్య సిబ్బందికి కేంద్ర ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ గడువును మరో 6 నెలలు పొడిగించింది.

Published : 20 Apr 2022 01:37 IST

కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం

దిల్లీ: కొవిడ్‌ సంబంధిత విధుల్లో పాలుపంచుకునే వైద్య, ఆరోగ్య సిబ్బందికి కేంద్ర ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ గడువును మరో 6 నెలలు పొడిగించింది. దీంతో ఏప్రిల్‌ 19 నుంచి మరో 180 రోజులు వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. ఇక ఈ పథకం కింద ఇప్పటివరకు 1905 మంది బాధితులకు చెల్లింపులు జరిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తలకు బీమా సదుపాయాన్ని కలిగించేందుకు 2020 మార్చి 30 నుంచి ‘ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ (PMGKP)’ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా కొవిడ్‌ సంబంధిత విధుల్లో ఎవరైనా మరణిస్తే వారికి రూ.50లక్షల బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు, ప్రైవేట్‌ హెల్త్‌ వర్కర్లతో సహా కొవిడ్‌ బాధితులకు నేరుగా సేవలందించే 22.12లక్షల మందికి ఈ బీమా సౌకర్యాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 1905 ఆరోగ్య కార్యకర్తలకు బీమా క్లెయిమ్‌ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని