Published : 14 Sep 2021 22:50 IST

Afghanistan: అఫ్గాన్‌వాసులకు అంతర్జాతీయ సమాజం అండ!

మానవతా సహాయ చర్యలకు నిధుల ప్రకటన

కాబుల్‌: తాలిబన్ల ఆక్రమణతో మరింత అధ్వాన స్థితిలోకి జారిపోయిన అఫ్గాన్‌వాసులను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. ఇటీవల జెనీవాలో ఐరాస ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అమెరికా సహా పలు దేశాలు దాదాపు 100 కోట్ల డాలర్ల సాయాన్ని అందజేసేందుకు ముందుకొచ్చినట్లు అఫ్గాన్‌ మీడియా తెలిపింది. మరోవైపు, అమెరికా అదనంగా మరో 6.4 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది. తాజాగా.. చైనా సైతం 1.5 కోట్ల డాలర్ల సాయం సమకూర్చుతానని హామీ ఇచ్చింది. ఈ విషయమై అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్‌ మంగళవారం చైనా రాయబారి వాంగ్‌ యూతో భేటీ అయినట్లు తాలిబన్ల ప్రతినిధి మహమ్మద్‌ నయీమ్‌ తెలిపారు.

నేరుగా కాకుండా ఐరాస ద్వారా..

అఫ్గాన్‌లో రాబోయే రోజుల్లో పేదరికం మరింతగా పెరుగుతుందని.. ఆహారం, మందుల కొరత ఏర్పడుతుందని ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కానీ, ఇప్పటికీ మెజారిటీ దేశాలు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోవడం, నిధుల వినియోగం విషయంలో వారిపై విశ్వాసం లేకపోవడంతో.. ఐరాస ద్వారా తమ సాయాన్ని అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సైతం ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. తమ ఆర్థిక సాయం తాలిబన్లకు కాకుండా నేరుగా స్వచ్ఛంద సంస్థలు, ఐరాస ఏజెన్సీలకు వెళ్తుందని వెల్లడించారు. మరోవైపు భారత్‌ కూడా అఫ్గానిస్థాన్‌లో దాతలకు ఎలాంటి అడ్డంకుల్లేని వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం స్పష్టం చేశారు.

అమెరికా మమ్మల్ని మెచ్చుకోవాలి.. 

ఐరాస సమక్షంలో అఫ్గాన్‌కు అత్యవసర సాయానికి హామీ ఇవ్వడంపై తాలిబన్ల ప్రభుత్వం మంగళవారం ప్రపంచ దేశాలకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ నిధుల్ని సద్వినియోగం చేసి పేదరికాన్ని నిర్మూలించడానికి వినియోగిస్తామని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అమెరికకా బలగాల ఉపసంహరణ, పౌరుల తరలింపులో సహకరించిన తాలిబన్లను అగ్రరాజ్యం మెచ్చుకోవాలని ఆయన కోరడం గమనార్హం. అమెరికా పెద్ద దేశం.. వారికి విశాల హృదయం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని