International flights: అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ.. రెండేళ్ల తర్వాత!

అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. కొవిడ్‌ కారణంగా నిషేధం విధించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు రెండేళ్ల తర్వాత పునఃప్రారంభం కానున్నాయి.......

Published : 09 Mar 2022 01:21 IST

దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. కొవిడ్‌ కారణంగా నిషేధం విధించిన అంతర్జాతీయ విమాన సర్వీసులను రెండేళ్ల తర్వాత కేంద్రం పునఃప్రారంభించనుంది. నిషేధాన్ని ఎత్తివేస్తూ.. ఈనెల 27 నుంచి సర్వీసులను ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టీకా కవరేజీని గుర్తించి,  సంప్రదింపుల అనంతరం 27.03.2022 నుండి షెడ్యూల్ చేసిన వాణిజ్య, అంతర్జాతీయ ప్రయాణ సర్వీసుల సేవలను తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’ అని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధ్రువీకరించారు. ఎయిర్‌ బబుల్‌ నిబంధనలు కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ కారణంగా గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 2020 మే నుంచి వందేభారత్‌ మిషన్‌, ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా కొన్ని విమానాలు నడుస్తున్నాయి. యూఎస్‌, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ వంటి పలు దేశాలతో భారత్‌ ఈ తరహా ఒప్పందం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని