Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
ఖలిస్థానీ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్‌పోల్ వెబ్సైట్లో వివరాలు పొందుపరిచింది.
దిల్లీ: ఖలిస్థానీ(Khalistani) ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్(Interpol) రెడ్ కార్నర్ నోటీసు(Red Corner Notice) జారీ చేసింది. తాజాగా తమ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించి వివరాలు పొందుపరిచింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బాబర్ ఖాల్సా ఇంటర్నేషనల్’ గ్రూప్‌నకు చెందిన కరణ్వీర్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్‌పోల్ వెల్లడించిన వివరాల ప్రకారం 38 ఏళ్ల కరణ్వీర్ సింగ్ పంజాబ్‌లోని కపుర్తాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడిపై భారత్‌లో హింసకు కుట్ర, హత్యలు, ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ, ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా వ్యవహరించడం తదితర నేరారోపణలు ఉన్నాయి. దీంతో భారత్ కరణ్వీర్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది.
భారత్-కెనడా(India Canada Row) మధ్య ఖలిస్థాన్ వివాదం కొనసాగుతున్న వేళ ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జె) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు చెందిన పంజాబ్‌లోని ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)(NIA) జప్తు చేసింది. ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న గురుపత్వంత్ సింగ్ పన్నూను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 2019లో మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇంటర్‌పోల్ రెండుసార్లు తిరస్కరించింది. మరోవైపు 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదులకు చెందిన ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసేందుకు సిద్ధం అవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు సగటున 78 హత్యలు
దేశంలో 2022లో 28,522 హత్యకేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో(29,272) పోల్చితే 2022లో 2.6 శాతం తగ్గుదల నమోదైంది. -
నేవీలో ర్యాంకుల పేర్లు మారుస్తాం: మోదీ
నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారత నౌకాదళానికి శుభాకాంక్షలు తెలిపారు. -
తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్టా ఫీస్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. -
నిర్ణయం తీసుకునే ముందే చర్చించాలి
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికపై లోక్‌సభలో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. -
రెండు ఆరోపణల్లోనూ రాఘవ చడ్డా దోషే
తప్పుదోవ పట్టించే విషయాలను మీడియాకు అందించిన అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను రాజ్యసభ హక్కుల కమిటీ దోషిగా నిర్ధారించింది. -
లోక్‌సభ సీట్ల పంపకంపై తేల్చాలి
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం అంశాన్ని తేల్చాలని ‘ఇండియా’ కూటమి సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) లేవనెత్తింది. -
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత వైద్యం!
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోంది. -
తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు
మణిపుర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలో సోమవారం రెండు తీవ్రవాద గ్రూపుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. -
తుపాను ధాటికి చెన్నై విలవిల
మిగ్జాం తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. చెన్నైలో గత 24 గంటల్లో 20 సెం.మీ. నుంచి 29 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. -
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే
-
‘మీరు పావలా.. అర్ధ రూపాయికీ పనికిరారు’
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’
-
Live Bomb: ఇంటి పెరట్లోనే బాంబు.. దంపతులు షాక్..!