Australia Murder: ఆ ఆస్ట్రేలియా యువతి హత్య వెనక అసలు కారణమదే..!
రాజ్విందర్ సింగ్ ఆస్ట్రేలియా యువతిని హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. క్షణికావేశమే ఈ ఘటనకు కారణంగా కనిపిస్తోంది.
దిల్లీ: నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో ఓ యువతిని హత్య చేసి భారత్‌లో తలదాచుకుంటున్న నిందితుడు రాజ్విందర్ సింగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ యువతిని హత్య చేయడానికి గల కారణాలను దర్యాప్తు బృందం వెల్లడించింది.
తన భార్యతో గొడవపడి నిందితుడు రాజ్విందర్ సింగ్(38) క్వీన్స్‌లాండ్‌లోని వాంగెట్టి బీచ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో వెంట కొన్ని పండ్లు, కూరగాయల కత్తిని తీసుకెళ్లాడు. అదే సమయంలో మృతురాలు తొయా కార్డింగ్లే ఆ బీచ్‌లో వాకింగ్ చేస్తున్నారు. అప్పుడు తన వెంట పెంపుడు శునకం కూడా ఉంది. అయితే అది సింగ్ వైపు చూసి మొరిగింది. అది నచ్చని అతడు యువతితో గొడవకు దిగాడు. తర్వాత ఘర్షణ తీవ్రం కావడంతో ఆగ్రహానికి గురైన సింగ్ ఆమెపై దాడిచేసి, చంపేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను అక్కడి ఇసుకలో పాతిపెట్టి, కుక్కను అక్కడి చెట్టుకు కట్టేసి ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పంజాబ్‌కు చెందిన సింగ్ నర్సింగ్ అసిస్టెంట్. కార్డింగ్లే ఫార్మసీ ఉద్యోగిని. 2018, అక్టోబర్ 21న కనిపించకుండాపోయారు. తర్వాత రోజు వాంగెట్టి బీచ్‌లో ఆమె మృతదేహం దొరికింది.
ఈ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింగ్ తన ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లల్ని వదిలేసి భారత్‌కు వచ్చేశాడు. అతడి ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. అతడి అప్పగింతకు భారత్ నుంచి ఆమోదం లభించడంతో పటియాలా కోర్టు నవంబర్ 21న నాన్‌బెయిల్ వారెంట్‌ను జారీ చేసింది. ఇంతకుముందు క్వీన్స్లాండ్ పోలీసులు.. రాజ్విందర్ ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్లు (రూ.8.17 కోట్లు) బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kangana Ranaut: ‘పఠాన్’ విజయంపై నిర్మాత ట్వీట్.. కంగనా రనౌత్ కామెంట్!
-
Politics News
Rahul Gandhi: ‘అలా అయితే మీరు నడవొచ్చు కదా’.. అమిత్ షాకు రాహుల్ సవాల్!
-
India News
S Jaishankar: శ్రీ కృష్ణుడు, హనుమాన్లు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలు
-
General News
Hyderabad Metro: ప్రైవేటు ఆస్తుల సేకరణ సాధ్యమైనంత వరకు తగ్గించండి: ఎన్వీఎస్ రెడ్డి
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!