Corona Virus: ‘డెల్టా’ పంజా.. ఇరాన్లో రికార్డు స్థాయిలో మరణాలు!
టెహ్రాన్: ఇరాన్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డెల్టా వేరియంట్ ఇరాన్లో మృత్యునాదం చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలోనే 709మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వైరస్ బారినపడిన వారిలో మరో 7,727మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొంది. నిన్న ఒక్కరోజే 40,600 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపింది. ఇరాన్లో వైరస్ వ్యాప్తి ఇంతలా పెరగడానికి కారణం డెల్టా వేరియంటేనని అధికారులు పేర్కొంటున్నారు. కొవిడ్ కట్టడికి విధించిన ఐదు రోజుల కఠిన లాక్డౌన్ ఇటీవలే ముగిసింది. ఇప్పటివరకు కేవలం ఎనిమిది శాతం మంది ఇరాన్ ప్రజలు మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అలాగే, తమ దేశంలో 40శాతం కన్నా తక్కువ మంది ప్రజలు మాత్రమే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Gastritis: వానాకాలంలో వచ్చే ముప్పు ఏంటో తెలుసా..?
-
Sports News
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
-
India News
Tamilnadu: తమిళనాడు మంత్రి కారుపై చెప్పు విసిరిన ఘటన.. భాజపా కార్యకర్తల అరెస్ట్
-
World News
Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
-
India News
Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
-
India News
Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
- శ్రీవారి దర్శనానికి రెండ్రోజుల సమయం.. 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు: తితిదే
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?