
Iran: అమెరికా అనుకుంటే ఒప్పందం కుదురుతుంది..!
ఇంటర్నెట్‌డెస్క్: పీ5+1 దేశాలతో అణుఒప్పందం కోసం వియన్నాలో జరుగుతున్న చర్చలపై ఇరాన్ స్పందించింది. చిత్తశుద్ధి ఉంటే ఈ ఒప్పందం అసాధ్యమేమీ కాదని పేర్కొంది. అమెరికా గతంలో ఈ ఒప్పందానికి తూట్లు పొడించిందని విమర్శించింది. చర్చల్లో చాలా ప్రతిపాదనలు తామే చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి సయిద్ ఖాతిబ్‌జాదే పేర్కొన్నారు. ‘‘ఒప్పందం సాధ్యమని ఇప్పటికీ భావిస్తున్నాం. ట్రంప్ విఫల చరిత్రను వదిలించుకోవాలని అమెరికా భావించాలి. ఇరాన్ ఇంకెప్పుడు దీనిపై చర్చలు జరపదు’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
పీ5+1 దేశాలతో 2015లో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికా వైదొలగింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో కొన్ని అడ్డంకులు తొలగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ‘పర్యవేక్షణ ఒప్పందం’ రద్దుకావడంతో దానిపై చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. అణు ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు తొలగే అవకాశం ఉంది. ఈ చర్చలు ఏప్రిల్‌లో మొదలయ్యాయి. తొలుత ఇవి జులై నాటి ముగిసే అవకాశం ఉందని భావించినా.. పరిస్థితులు చూస్తుంటే మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Business News
Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
-
Ap-top-news News
Andhra News: 10.30కి వివాదం.. 8 గంటలకే కేసు!
-
Ap-top-news News
Margani Bharat Ram: ఎంపీ సెల్‌ఫోన్ మిస్సింగ్‌పై వివాదం
-
Ap-top-news News
Andhra News: ప్రభుత్వ బడిలో ఐఏఎస్ పిల్లలు
-
Ts-top-news News
Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- రూ.19 వేల కోట్ల కోత
- Abdul kalam: కలాం అలా కళ్లెం వేశారు!.. ముషారఫ్‌ను నిలువరించిన వేళ..