అమెరికా, బ్రిటన్‌ వ్యాక్సిన్లు మాకొద్దు: ఇరాన్‌

పశ్చిమ దేశాల పట్ల తమ అపనమ్మకాన్ని ఇరాన్‌ మరోసాని వెలిబుచ్చింది. అమెరికా, బ్రిటన్‌ దేశాలకు చెందిన వ్యాక్సిన్లను ఇరాన్‌లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ కీలక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తెలిపారు.

Published : 09 Jan 2021 00:54 IST

టెహ్రాన్‌: పశ్చిమ దేశాల పట్ల తమ అపనమ్మకాన్ని ఇరాన్‌ మరోసారి వెలిబుచ్చింది. అమెరికా, బ్రిటన్‌ దేశాలకు చెందిన వ్యాక్సిన్లను ఇరాన్‌లో నిషేధిస్తున్నట్లు ఆ దేశ కీలక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ తెలిపారు. ‘‘అమెరికా, బ్రిటన్కు చెందిన వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడం ఇరాన్‌లో నిషేధించాం. ఇదే విషయం అధికారులకు స్పష్టం చేశాం. ఇప్పుడు నేను బహిరంగంగా ప్రకటిస్తున్నా’’ అని ఆయన ఒక టెలివిజన్‌ ప్రత్యక్ష ప్రసారంలో వెల్లడించారు. ఆ రెండు దేశాలపై తనకు నమ్మకం లేదని ఖమేనీ తెలిపారు. వారు సరైన వ్యాక్సిన్‌నే తయారు చేస్తే వారి దేశంలో భారీగా కేసులు నమోదవ్వవన్నారు. వీలైతే తనకు నమ్మకమున్న ప్రాంతాల నుంచి ఇరాన్‌ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటుందని ఖమేనీ తెలిపారు. ఫ్రాన్స్‌ నుంచి వ్యాక్సిన్లు పొందేందుకు కూడా ఇరాన్‌ సుముఖంగా లేదని ఆయన వెల్లడించారు. మరోవైపు ఇరాన్‌ తన సొంత టీకా తయారీని ప్రారంభించింది. గత నెలలో దీనిపై మానవ ప్రయోగాలను కూడా మొదలుపెట్టింది. 

ఇవీ చదవండి..

ఆ ఆరు రాష్ట్రాల్లోనే బర్డ్‌ ఫ్లూ..

సీఎంలతో భేటీ కానున్న ప్రధాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని