
Divorce: పాట నచ్చలేదని.. వధువుకు విడాకులిచ్చిన వరుడు..
బాగ్దాద్: తమ వివాహ వేడుకల్లో వధువు, వరుడు డ్యాన్స్‌లు చేయడంఈ మధ్యకాలంలో ట్రెండ్‌గా మారింది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అంతటా ఈ కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. డీజే పాటలకు వధూవరులిద్దరూ ఒకరికి మించి మరొకరు స్టెప్పులేస్తూ ఎంజాయ్ సన్నివేశాలు సహజమే. డ్యాన్స్ చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి స్నేహితులతో పంచుకుంటారు.
ఇరాక్‌లో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. భార్య డ్యాన్స్ చేసిందని భర్త పెళ్లిలోనే విడాకులిచ్చాడు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ యువకుడు ఓ అందమైన అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుకల్లో భాగంగా కొత్త పెళ్లి కూతురు ఓ పాటకు డ్యాన్స్ చేసింది. (నీపై నేను అధిపత్యం చెలాయిస్తా. నేను చెప్పినంటే నువ్వు నడుచుకోవాలి. నేను అహంకారిని) అని అర్థం వచ్చే పాట అది. దీంతో వరుడికి, అతడి కుటుంబసభ్యులకు కోపం వచ్చి వధువుతో వాగ్వాదానికి దిగారు. ఆ పాటతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్న వరుడు.. వివాహ వేదికపైనే విడాకులిచ్చాడు. ఈ విషయం చర్చానీయాంశం అయింది. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన విడాకుల కేసుని స్థానిక మీడియా వివరించింది. అయితే, పాటల కారణంగా విడాకులు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఓ జోర్డాన్ వ్యక్తి తన పెళ్లి వేడుకల్లో ఇదే పాటను ప్లే చేయడంతో తన భార్యకు విడాకులిచ్చాడు. లెబనాన్‌లో కూడా ఓ వరుడు పాట కారణంగా భార్య నుంచి విడిపోయాడు.
ఇవీ చదవండి
Advertisement